విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.



