స్కూల్స్ క్లీన్‌గా ఉండాల్సిందే!

మంగళగిరి బ్యాంక్ కాలనీ మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్కూల్స్, క్లాస్‌రూమ్స్, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. స్టూడెంట్స్ హెల్దీగా ఉంటేనే సొసైటీ బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ పాఠశాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ ఈవెంట్‌లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.



