పాఠశాల SMC చైర్మన్‌గా దేవదాస్ ఏకగ్రీవ ఎన్నిక

కర్నూలు జిల్లా హోళగుంద మండలం మడ్డి లింగదహళ్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC)ని ఏర్పాటు చేశారు. SMC చైర్మన్‌గా దేవదాస్, వైస్ చైర్మన్‌గా శివగంగమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హెడ్‌మాస్టర్ లలితమ్మ, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధిలో కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని గ్రామ TDP నాయకులు, యువకులు ఆకాంక్షించారు.



