← Back to news

విభజన హామీల పరిష్కారానికి కేంద్రానికి చంద్రబాబు వినతులు

By E.Rajaratnam· 19 Aug 2026
విభజన హామీల పరిష్కారానికి కేంద్రానికి చంద్రబాబు వినతులు

AP: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల పరిష్కారంతోపాటు రాష్ట్ర కీలక మౌలిక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. మహాబలిపురంలో అమిత్‌ షా అధ్యక్షతన జరిగే 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించనున్నారు. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన, ఆస్తులు–అప్పులు, రెవెన్యూ గ్యాప్‌, పన్ను సమస్యల పరిష్కారంతో పాటు దుగరాజుపట్నం పోర్టు, విశాఖ–విజయవాడ మెట్రో, రైల్వే కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు.

More in AP