పట్టపగలే షాకింగ్ మర్డర్!

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో పట్టపగలే ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. పాత కక్షల వల్ల ఆమేర్ (35) అనే వ్యక్తిపై సుమన్ అనే అతడు కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమేర్‌ను ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లగా, అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు.



