పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

పిల్లలు ప్రతి చిన్న విషయానికీ అబద్ధాలు చెబుతున్నారా? దీనికి కారణం అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ నుంచి తప్పించుకోవాలనే భయం కావచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేసిన తప్పుకి తిట్లు, దెబ్బలు పడతాయనే భయంతో కూడా పిల్లలు నిజం దాచొచ్చు. అందుకే అబద్ధం చెప్పిన వెంటనే తిట్టకుండా.. ఎందుకు అలా చెప్పారో ప్రశాంతంగా తెలుసుకోవాలి. పేరెంట్స్ పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదు. నీతి కథలతో నిజాయితీ విలువను చెప్పాలి. నిజం చెప్పినప్పుడు అప్రిషియేట్ చెయ్యాలి. ఇలా చేస్తే వారిలో నిజం చెప్పే ధైర్యం పెరుగుతుంది.



