డైపర్.. వాడి పడేయాల్సిందేనా?

డైపర్ అంటే ఒక్కసారి వాడి పడేయాల్సిందేనా? ఇప్పుడు కొందరు పేరెంట్స్ రీయూజబుల్ క్లాత్ డైపర్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు. ముంబైకి చెందిన సస్టైనబుల్ పేరెంటింగ్ క్రియేటర్ సోనికా భాసిన్ తన బిడ్డకు వీటినే వాడుతున్నారు. ఇవి పాతకాలం క్లాత్ డైపర్లలా కాకుండా.. అబ్జార్బెంట్ ఇన్‌సర్ట్స్, వాటర్‌ప్రూఫ్ లేయర్‌తో వస్తాయి. వాష్ చేసి మళ్లీ యూజ్ చేయొచ్చు. దీంతో డైపర్ వేస్ట్, ఖర్చు రెండూ తగ్గుతాయి. అయితే రెగ్యులర్‌గా వాష్ చేయాలి. ఇంట్లో క్లాత్ డైపర్లు, ట్రావెల్‌లో డిస్పోజబుల్ డైపర్లు.. ఇలా రెండింటినీ యూజ్ చేయొచ్చు.



