ఖర్గే ప్రసంగించిన మైదానాన్ని శుద్ధి చేసిన బీజేపీ
ఆగస్టు 8న ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విజయ శంఖనాద్ ర్యాలీలో ప్రసంగం చేశారు. 2027 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన కార్యక్రమం ఇది. తను ప్రసంగించిన తర్వాత బీజేపీ వర్గాలు ఆ మైదానాన్ని ‘శుద్ధి’ చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆరోపించారు. తాను అక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడారని, ఏ మతం లేదా కులం పేరు తీసుకోలేదని చెప్పారు.



