నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయపడకూడదు: రాహుల్ గాంధీ
‘అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఆపుతారా?’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాను ప్రశ్నించారు. పార్లమెంట్ బయట ఆయన మాట్లాడుతూ ‘అమిత్ షాకు ఏం ప్రత్యేకత ఉందని మొత్తం మీడియా ఆయన ముందు మౌనంగా నిలబడి ఉంటుంది?’ అని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు దేశ విద్యార్థులు భయపడనప్పుడు, మీడియా కూడా వారికి భయపడకూడదని చెప్పారు.



