అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించొద్దు: CPM

కర్నూలు జిల్లా డోన్ మండలంలో “ప్రమాదంలో ప్రజాస్వామ్యం – ఓటు హక్కును కాపాడుదాం – ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం” అనే నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాశక్తి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. SIRలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలని కోరారు.



