పిడుగురాయిలో పాత పాఠశాల భవనం కూల్చివేత
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని పిడుగురాయి పాఠశాల పాత భవనం కూల్చివేత పనులు చేపట్టారు. కొత్త పాఠశాల భవన నిర్మాణం కోసం పాత భవనాన్ని తొలగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కొత్త భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. పాఠశాలకు కొత్త భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.



