← Back to news

రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

By dk· 17 Jun 2026· Dishadaily· రంగారెడ్డి జిల్లా
రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

TG: రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS)ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో పాఠశాల భవనాన్ని ప్రారంభించి, TPS పైలాన్‌ను ఆవిష్కరించారు. పాఠశాలలో 'అల్పాహార పథకాన్ని' ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో నాలుగు స్కూళ్లలో ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఇందులో ఉన్నాయి.

రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

More in Education