రూల్స్ కమిటీ తొలి సమావేశం

TG: శాసనమండలి సమావేశాలు మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సభా నియమాల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. శాసనమండలిలో నిర్వహించిన రూల్స్ కమిటీ తొలి సమావేశంలో మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యలను సభ్యులు సమర్థంగా ప్రస్తావించేలా అనువైన వాతావరణం ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు. చట్టసభలను క్రమబద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంలో రూల్స్ కమిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.



