ఆస్పత్రి నిధులపై బిగ్ ఆడిట్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో నిధుల వినియోగంపై విజయవాడ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ ఆడిట్ కమిటీ విచారణ చేపట్టింది. ఆసుపత్రి ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, సంబంధిత రికార్డులను సభ్యులు పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న, ఒప్పంద ఉద్యోగి చందుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు లక్ష్మీప్రసన్న పరిధిలోని రికార్డులు, నిధుల లావాదేవీల పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు.



