← Back to news

SGF క్రికెట్ సెలక్షన్స్‌పై ఆరోపణలు

By అనిల్ బాబు· 20h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
SGF క్రికెట్ సెలక్షన్స్‌పై ఆరోపణలు

నల్గొండ జిల్లాలో SGF జిల్లాస్థాయి క్రికెట్ సెలక్షన్స్‌పై క్రీడాకారులు పలు ఆరోపణలు చేశారు. సెలక్షన్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని విస్తృతంగా తెలియజేయకుండానే ఎంపికలు నిర్వహించారని వారు ఆరోపించారు. గతేడాది సుమారు 300మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఈసారి కేవలం 8మంది బాలికలు, 20మంది బాలురతోనే సెలక్షన్స్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెలక్షన్స్ ప్రక్రియపై విచారణ జరిపి, అర్హులైన క్రీడాకారులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

More in Local