ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకం: రవిశంకర్

AP: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి శక్తివంతమైన కేంద్రబిందువుగా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఆయన నిర్మాణ శైలి, కళాకృతులను ప్రశంసించారు. అనంతరం గూడెపువలసలో GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. GMR గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 11 వృత్తివిద్యా కోర్సుల్లో 239 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు.



