28నుంచి డేటా సెంటర్ పనులు షురూ

విశాఖ గూగుల్ డేటా సెంటర్ పనులు ఈనెల 28 నుంచి మొదలవుతాయి. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు అవనున్న ఈ సెంటర్ జులై2028 నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ , అదానీ ఇన్ ఫ్రా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్, తదితరులు పాల్గొంటారు.



