OpenAI కొత్త మోడల్ GPT-6 Astra

AI రంగంలో పోటీ మరింత వేడెక్కుతోంది.. OpenAI తాజాగా GPT-6 Astraను విడుదల చేసింది. కంపెనీ ప్రకారం ఇది కంప్యూటర్‌ను స్వయంగా ఉపయోగిస్తూ వెబ్‌లో రీసెర్చ్, ఫారమ్‌లు నింపడం, కోడింగ్, డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లు తయారు చేయడం వంటి పనులు చేయగలదు. సైబర్ సెక్యూరిటీ, సైన్స్, ప్రొఫెషనల్ పనుల్లోనూ ఇది భారీ అప్‌గ్రేడ్‌గా చెబుతోంది. కొన్ని పరీక్షల్లో Astra మునుపటి మోడళ్లను మించి స్కోర్లు సాధించింది. త్వరలో ChatGPT Plus, Pro, Business, Enterprise యూజర్లకు రానుంది.



