అదనపు కలెక్టర్ బీఎస్ లతకు ఘన వీడ్కోలు

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతకు జిల్లా అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 1987 మే 16న ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆమె వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 2024లో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెవెన్యూ, ధాన్యం కొనుగోళ్లు, ప్రజావాణి, ఎన్నికలు తదితర అంశాల్లో అధికారులతో సమన్వయం చేస్తూ సేవలందించారు. ఇవాళ విరమణ చేయడంతో అధికారులు, సిబ్బంది ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.



