రూ.700 ట్రిప్‌కు రూ.600 పార్కింగ్ ఏంటని? డ్రైవర్ ఆగ్రహం
AP: భోగాపురం ఎయిర్ పోర్టులో కమర్షియల్ ట్యాక్స్, వెయిటింగ్ ఛార్జీల వసూలుపై క్యాబ్ డ్రైవర్ సిబ్బందిని నిలదీశారు. తన ట్రిప్ ఛార్జీ రూ.700 కాగా, పార్కింగ్‌కే రూ.600 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి నిబంధనలు కావని, దారుణం, అన్యాయమంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని సిబ్బంది స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు వాహనం కదపనని డ్రైవర్ తేల్చిచెప్పారు.



