Appleను ఇండియాలోనే కట్టిపడేయడానికి కొత్త ట్యాక్స్ ప్లాన్..

విదేశీ కంపెనీలు తమ మెషినరీని ఇండియాలోని కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్స్‌కు ఇచ్చి ప్రొడక్ట్స్ తయారు చేయించినప్పుడు లభించే ట్యాక్స్ మినహాయింపును 2041 వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. Apple కంపెనీ కూడా గతంలో ఈ ట్యాక్స్ రూల్స్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రిలీఫ్ అమల్లోకి వస్తే యాపిల్‌తో పాటు ఇతర విదేశీ కంపెనీలు కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్‌ను మరింత పెంచే అవకాశం ఉంది



