దాచేపల్లి బస్టాండ్ రెడీ.. త్వరలో ప్రారంభం!

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ప్రజలు, ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్టాండ్ నిర్మాణం పూర్తయింది. ఇప్పటివరకు బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ఎండ, వానల్లో రోడ్డుపైనే బస్సుల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. వాష్‌రూమ్ సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. MLA యరపతినేని శ్రీనివాసరావు చొరవతో బస్టాండ్ నిర్మాణానికి ముందడుగు పడింది. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



