వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య

AP: తిరుపతికి చెందిన జగదీశ్ (47) కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంపేటలోని ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఆయన, భార్యతో జరిగిన వాగ్వాదం అనంతరం చంద్రగిరిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఆత్మహత్యకు ముందు భార్యకు వీడియో కాల్ చేసి తన నిర్ణయాన్ని తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, జగదీశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



