లక్షకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్!

భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు లక్షకు పైగా (1,00,843) ఒక్క టీచర్ తోనే నడుస్తున్నాయని UDISE+ 2025–26 డేటా ఆధారం తో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 16,357 సింగిల్-టీచర్ పాఠశాలలు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలో 16శాతం పైగా ఉంది. తెలంగాణలో ఇలాంటి స్కూళ్లు 4,793 ఉన్నాయి. ఏపీ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లోనే దేశంలోని 65శాతం సింగిల్-టీచర్ స్కూళ్లు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ లోపాల వల్లే ఈ ప్రాబ్లమ్ వచ్చిందని గవర్నమెంట్ రాజ్యసభలో చెప్పింది.



