మెటా, గూగుల్‌పై గడ్కరీ కేసు

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP), E20 కార్యక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని బాంబే హైకోర్టును కోరారు. మెటా, గూగుల్, ఎక్స్ తదితర సంస్థలపై దావా వేసేందుకు బాంబే హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. తప్పుడు, కల్పిత, పరువు నష్టం కలిగించే AI వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని ఆయన దావాలో కోరారు.



