చింతూరు డీఎఫ్ఓగా సంకేత్ సునీల్

పోలవరం జిల్లా చింతూరు అటవీ డివిజన్ డిఎఫ్ఓగా గరుడ్ సంకేత్ సునీల్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు సబ్ డి ఎఫ్ ఓ గా పని చేస్తున్న 2023 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన సునీల్ సంకేత్ ను చింతూరు డిఎఫ్ఓ గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ డీఎఫ్ఓ గా పనిచేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డిని అనంతపురం డిఎఫ్ఓ గా బదిలీ చేశారు. మరోవైపు చింతూరు అటవీ డివిజన్ పరిధిలోని లక్కవరం సబ్ డి ఎఫ్ ఓ గా పనిచేస్తున్న శివకుమార్ గంగాల్ ను రంపచోడవరం డిఎఫ్ఓగా బదిలీ చేశారు



