అంబులెన్స్ డ్రైవర్లకు ట్రాఫిక్ శిక్షణ

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిలకలగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జగన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. సురక్షిత డ్రైవింగ్, అత్యవసర సమయాల్లో మాత్రమే సైరన్ వాడాలని, లైసెన్స్ లేకుండా నడపొద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



