అరకులోయలో కౌంటింగ్ సెంటర్ చెక్!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను MPDO వీసం ప్రసాద్ శనివారం పరిశీలించారు. విద్యుత్, తాగునీరు, శానిటేషన్, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ MPDO సత్యనారాయణ, మండల ఇంజనీరింగ్ ఇన్‌చార్జి పైడితల్లి, AO వీరభద్రరావు పాల్గొన్నారు.



