పింఛన్ కోసం బతికున్న భర్తను చంపేసింది

AP: వితంతు పింఛన్ పొందాలన్న ఆశతో బతికున్న భర్తను చనిపోయినట్లు చూపించి మరణ ధ్రువపత్రం పొందిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. కానూరు శివాలయం రోడ్డుకు చెందిన యర్రంశెట్టి రమాదేవి తన భర్త మురళీకృష్ణ మృతిచెందినట్లు తాడిగడప మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరణ ధ్రువపత్రం పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఇటీవల భర్తకు తెలియడంతో విచారణ చేపట్టారు. రమాదేవి తన తప్పును అంగీకరించినట్లు కమిషనర్ నజీర్ పేర్కొన్నారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.



