IAS దివ్యా మిట్టల్ రాజీనామా

2013 బ్యాచ్ IAS అధికారి దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సర్వీస్ తర్వాత రాజీనామా చేశారు. మిర్జాపూర్‌లో 75 ఏళ్లుగా తాగునీరు లేని లహురియాదహ్ గ్రామానికి పైప్‌లైన్ ద్వారా నీరు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఒత్తిడి లేదా ఏదైనా సంఘటన వల్ల తీసుకున్న నిర్ణయం కాదని ఆమె తెలిపారు. కుటుంబం, పర్సనల్ ప్రిఫరెన్స్, తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఇతర విషయాల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.



