← Back to news

భారత్‌కు ఉజ్బెకిస్థాన్‌ నుంచి యురేనియం

By Nani Garikina· 4d ago· Gov
భారత్‌కు ఉజ్బెకిస్థాన్‌ నుంచి యురేనియం

భారత్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరో కీలక అడుగు వేసింది. ఉజ్బెకిస్థాన్‌ నుంచి భారత్‌కు దీర్ఘకాలంగా యురేనియం సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అణు విద్యుత్‌ కేంద్రాలకు యురేనియం కీలక ఇంధనం కావడంతో.. ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను పెంచుకోవడం భారత్‌కు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్‌ వచ్చే సంవత్సరాల్లో అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం పెరిగింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.