← Back to news

తారురోడ్డు పనులు పరిశీలించిన MPTC నారాయణ

By SINDERI KAMESH· 1d ago· Koyyuru, Koyyuru, Alluri Sitharama Raju
తారురోడ్డు పనులు పరిశీలించిన MPTC నారాయణ

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలో పోకలపాలెం–కునుకూరు గ్రామాల మధ్య జరుగుతున్న నూతన తారురోడ్డు నిర్మాణ పనులను MPTC నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిపై JE, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా పనులు చేపట్టాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పూర్తిచేయాలని కోరారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.

More in Local