స్కూల్‌లో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో HM టి.ఎస్. సోనీతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



