నెల్లూరులో రోడ్డు ప్రమాదం

AP : నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజుపేట దగ్గర నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన 47 ఏళ్ల షేక్ రసూల్ బాషా, 45 ఏళ్ల మణికల సుధాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేస్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.



