కూకట్‌పల్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావు హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు హాస్పిటల్ 4వ అంతస్తులోని వీకేఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్‌లో శిబిరం కొనసాగనుంది. ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవచ్చని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చింది.



