← Back to news

కారులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్‌

By Mahesh· 13 Aug 2026· AP
కారులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్‌

AP: రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 25.970 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో మూడు పాలిథిన్‌ సంచుల్లో గంజాయిని గుర్తించారు. దీని వాల్యూ రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లెకు చెందిన సుజీవ్‌కుమార్‌, నరేష్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకునే వ్యక్తితో పాటు సీలేరు సమీపంలోని సప్లయర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.