← Back to news

బెంగళూరులో ప్రకాశ్‌రాజ్ ఓటు గల్లంతు

By విశీ· 11 Aug 2026· Instagram

నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ ఓటు గల్లంతయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత తొలగించిన 65 లక్షల ఓట్లర్లో తనూ ఒకడిని అని ఆయన వివరించారు. తను అక్కడే పుట్టానని, తన స్కూలింగ్, కాలేజీ, నాటక జీవితం అన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయని వివరించారు. ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశానని తెలిపారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందడానికి ఏ ప్రాసెస్ పాటించాలో చూద్దామని కామెంట్ చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 12h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.