← Back to news

శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడిపై దాడి

By Vishi· 13 Aug 2026
శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడిపై దాడి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్‌లో పూజలు చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో బాదల్‌పై దాడికి ప్రయత్నించారు. బాదల్ సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాడిలో బాదల్ చేతికి గాయం కాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.