5వ అంతస్తు నుంచి దూకిన PG మెడికో

TG: హైదరాబాద్ శివారు నాగారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. MBSS పూర్తి చేసి బెంగళూరు సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో PG (ఆప్తాల్మాలజీ) మొదటి సంవత్సరం చదువుతున్న దీక్షిత(26) అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవలే సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. చదువు ఒత్తిడి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



