500 కుట్టుమిషన్లు మంజూరు చేయండి: MLA

ఖేడ్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 500 కుట్టుమిషన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీ వరెడ్డి కోరారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్‌లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. గతంలో ఖేడ్‌లో షాదీ ఖానా నిర్మాణానికి 50 లక్షలు, పట్టణ మహిళలకు 200 కుట్టుమిషన్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.



