లక్కంపల్లి సెజ్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ

నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, రూరల్ MLA భూపతిరెడ్డితో కలిసి అనువైన స్థలాలను పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్నందున ఈ ఫ్యాక్టరీతో పాటు రైస్‌బ్రాన్, సోయా పరిశ్రమల ఏర్పాటుకూ ప్లాన్ చేస్తున్నామని, దీనివల్ల రైతులకు మంచి మార్కెట్‌తో పాటు లోకల్‌గా ఉపాధి పెరుగుతుందని తెలిపారు.



