← Back to news

అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షాలు

By Krishna· 1d ago· Gov
అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని సుడి గాలులు గంటకు 38 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఈ అల్పపీడనం విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, కోల్‌కతా వరకూ విస్తరించి ఉంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో సెప్టెంబర్ 10 నుంచి 15 వరకూ, తెలంగాణలో సెప్టెంబర్ 10, 13, 14, 15 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయి అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా తెలిపింది.

More in Current Affairs