4వ వార్డులో డ్రైనేజీ సమస్య
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ 4వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో నిలిచిపోవడంతో దోమల వృద్ధి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ఉందన్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.



