ప్రిన్సిపల్ మాకొద్దు.. రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాలలో కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జహీరాబాద్–పొట్పల్లి రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టగా గ్రామసర్పంచ్, స్థానికులు వారికి మద్దతు తెలిపారు. కళాశాలలో వసతుల లేమితోపాటు ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువయ్యాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ బదిలీపై హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.



