'నేత కార్మికులకు అండగా నిలవాలి'

రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ కార్పొరేటర్ వాపాల రమేశ్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. నేత కార్మికుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కోరారు. పవర్‌లూమ్‌లకు విద్యుత్ బిల్లులపై ఇస్తున్న సబ్సిడీని 50 నుంచి 100 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.



