బస్సులో ఆడవాళ్ళ కొట్లాట!
విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు సీటు కోసం జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలిక బెజ్జుపల్లి భార్గవి తీవ్రంగా గాయపడింది. బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



