గోదావరి పుష్కరాలకు ముహూర్తం కన్‌ఫర్మ్

AP: పవిత్ర గోదావరి నదీ పుష్కరాల నిర్వహణకు ముహూర్తం కన్‌ఫర్మ్ అయ్యింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముహూర్తానికి సంబంధించి టీటీడీ ఆస్థాన పండితులు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌కు వివరాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.



