← Back to news

25 ఏళ్లైనా వీడని టెర్రర్ టెన్షన్

By Krishna· 8 Sept 2026
25 ఏళ్లైనా వీడని టెర్రర్ టెన్షన్

అమెరికా ఇప్పటికీ 9/11 టెర్రర్ టెన్షన్‌తో జీవిస్తోంది. 25 ఏళ్ల తర్వాత కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిన ఆ భయంకరమైన జ్ఞాపకం మాయం కాలేదు. సుమారు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా జాతీయ భద్రతా విధానాలు మారిపోయి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో దశాబ్దాల యుద్ధాలకు దారితీశాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్‌లో చూసే ప్రతీ వస్తువు, ప్రతీ పేరు.. ఆ రోజు భయాన్ని గుర్తుచేస్తోంది. ఎయిర్‌పోర్టులూ, భద్రతా వ్యవస్థలూ మారినా, “ఎప్పుడైనా మళ్లీ ఉగ్రదాడి జరగవచ్చు” అనే భయం అమెరికన్ల మనసుల్లో నుంచి ఇంకా పోలేదు.

More in International