సైకిల్‌పైనే జ్యోతిర్లింగాల దర్శనం!

జ్యోతిర్లింగాల దర్శనమే లక్ష్యంగా సైకిల్‌పైనే ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వద్దకు చేరుకుంది. యాత్రలో భాగంగా దుత్తలూరు చేరుకున్న సైకిల్ యాత్రికుడిని మీడియా ప్రతినిధులు పలకరించగా, తన ప్రయాణ వివరాలను వెల్లడించారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ క్షేత్రాలను కూడా సైకిల్‌పైనే చేరుకుని దర్శించుకుంటానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యాత్రను ఆపకుండా కొనసాగిస్తానన్నారు.





