సొంతింటి కల నిజమైంది.. క్రిస్టియన్‌పేటలో సంబరాలు

క్రిస్టియన్‌పేట ప్రజల నాలుగు దశాబ్దాల సొంతింటి కల నెరవేరింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ చొరవతో స్థానికులకు ఇంటి పట్టాలు అందడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ చిరకాల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి నారా లోకేష్‌కు, కూటమి ప్రభుత్వానికి క్రిస్టియన్‌పేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.



